నురగవై తరగవై నదివి నీవై

వలపంత వాన కురిస్తేనే కదా బతుకంత నది నిండింది

తడిసి వస్తే తనివి తీరక, కలిసి పోయాకేగా కాలమాగింది

చేయి పట్టాక, చెలిమి చేశాక

వొంపు తిరిగాక, వగలు పోయాక

అలల అయస్కాంతాలు అదుపుతప్పి

ఆవహించాకేగా వళ్లంతా వానమబ్బయింది

పోటెత్తిన పిచ్చి అశలతోనే కదా, పడవల్ని పోనిచ్చి

ఒంటరి నదిలో వర్షం వెయ్యి మునకలేసింది

జారిపోయే తొలిజాములో జాలరి పాట వినరాక కదా

కృష్ణవేణీ, నీ జాలిగుండె కెరటాలుగా కరిగిపోయింది!

Leave a comment