Random thoughts on “The Shawshank Redemption”

Freedom
More freedom
Less freedom
Lack of freedom
Never enough freedom
Relative freedom
నవరాత్రి సినిమాలో సావిత్రి పోలీస్ స్టేషన్ లో పిచ్చిదానిలా మాట్లాడుతుంది. “నాయనా అసలు చరసాల కాని ప్రదేశం ఎక్కడైనా ఉందా లోకంలో?” అని. ఈ సినిమా చూస్తున్నంతసేపు అచ్చం మనుషులందరం ఇలానే బతుకుతున్నాం అనిపిస్తుంది. దాన్లోని హింస, భయం వీటన్నిటి ఎక్స్ట్రీమిటీ లోని డిగ్రీ లు మనిషి మనిషికి మారతాయి కానీ మిగతా అంతా ఒకటేనా అని చెక్ చేసుకుంటాం.
You can do certain things, not allowed to do several other things, you are judged and punished for even minor violations all the time.
ఈ రూల్స్ అన్నీ మరీ విధ్వంసకమైన పనులగురించే కాదు. చాలా మామూలు చిన్న చిన్న విషయాలకీ ఉంటాయి. వయసుతో కూడా పని లేదు. ప్రతి వయసులోనూ ఎవరో ఉంటారు రూల్స్ పెట్టేవాళ్ళు, భయపెట్టి శిక్షించేవాళ్ళు. స్కూళ్ళు, హాస్టళ్ళు, పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు, రొటీన్, ఓవర్ డిసిప్లిన్, సెల్ఫ్ ఇమేజ్, ఒక్కోటీ ఒక్కోరకం ప్రిజన్.
Red talks about how institutionalization tames people and makes them totally dependent. You hate the walls first, slowly get used to them and suddenly become totally clueless about how to live without walls. The scene when Brook walks out of the jail, it just reminds of someone walking out of an unhappy Job or marriage. One is supposed to feel good when that happens. But one gets nervous walking out, as prison is safe. It’s predictable, it doesn’t require you to make decisions and take responsibility. You can just blame everything on the prison and say “If only I were free.
” What a luxury! What a pity!
జైల్ నుంచి వచ్చేశాక బ్రూక్ కి బతకడం చేతకాదు. I want to be home అనుకుంటాడు జైల్ ని తలచుకుని. ఒంటరైపోతాడు. చచ్చిపోతాడు. మనకి కూడా రకరకాల జైళ్లలోనుంచి బయటపడ్ద ప్రతిసారి కొత్తప్రపంచం అయోమయంగా ఉంటుంది. విడుదలయ్యాక రెడ్ ది కూడా అదే పరిస్థితి. కానీ దూరంగా ఒక స్నేహితుడు ఎదురు చూస్తున్నాడన్న ఆశ అతన్ని బ్రతికించింది. ఇరవయ్యేళ్ళుగా తనతో స్నేహంగా ఉన్న ఆండీ తప్పించుకున్నాక, రెడ్ ని జైల్లో చూస్తే పోతపోసిన ఒంటరితనంలా అనిపిస్తాడు. ఉన్న చోటు ఎలాంటిదైనా మనతో ఉండే మనుషుల వల్ల అక్కడి విషాదం, సంతోషం చాలావరకూ మారిపోతాయనిపిస్తుంది అతన్నలా చూసినప్పుడు.
జైల్లో టైం గడవదు. ఆండీ ఎన్ని పనులు చేస్తాడు! గోడలో కన్నం తవ్వడం, రాళ్ళతో బొమ్మలు చెయ్యడం, లైబర్రీ చూసుకోడం, చదువు చెప్పడం. ఓవర్ ప్రొడక్టివిటీ చాలాసార్లు దేన్నుంచో పారిపోడానికి చేస్తున్న ప్రయత్నంలా అనిపిస్తుంది. లేకపోతే వేరే పనులేవీ చెయ్యడానికో, ఖాళీగా ఉండటానికో స్వేచ్చ లేక ఒకేపని అతిగా చెయ్యడమూ ఒక అనివార్యత కొన్ని జీవితాల్లో.
“నేను ట్రిగ్గర్ నొక్కలేదు కానీ నా భార్య చావుకి నేనే కారణం” అంటాడు ఆండీ. మనుషుల విషయంలో “నిర్లక్ష్యం” చేసే డామేజ్ చాలా పెద్దది. ఏదో ఒకటి అనడం కన్నా ఏం పట్టించుకోకుండా వదిలెయ్యడమే ఎక్కువ చంపేస్తుంది దగ్గరవాళ్లని. ఎన్నోసార్లు పరిణామాలు, కారణాలు పక్కపక్కనే కనపడవు. తుపాకీ శబ్ధం చేస్తుంది కానీ, స్లో పాయిసన్ వాసన బయట పడదు.
సినిమా చివర్లో అతను కలలు కన్న పసిఫిక్ సముద్రం ఒడ్డున ఎంతో హాయిగా కనపడతాడు ఆండీ. అప్పటిదాకా అతన్ని జైల్లో చూశాం కాబట్టి బయట అనంతమైన ఆకాశం కింద, సముద్రపు ఇసుకలోచూడ్దం స్వేచ్చకి ప్రతీకలాగా అనిపిస్తుంది. ఇంకో ఉదాహరణని ఊహిస్తే, అదే సముద్రం ఒడ్డున అలాగే ఇరవయ్యేళ్ళుగా మోటెల్ నడిపే మరొకతను “ఏంటీ గాడిద బతుకు?” అనుకుని ఆ పాటికి విసుగుతో ఆత్మహత్య ఆలోచనతో ఉంటాడేమో ఎవరికి తెలుసు? లోకంలో తన మనిషంటూ ఎవరూ లేని ఆండీకి ఎంత ఆకుపచ్చటి సముద్రమైనా అందంగా ఉంటుందా అనేది మరో అనుమానం.
డబ్బు కోసమో, సంతోషం కోసమో పని చెయ్యడాన్ని పక్కనపెడితే, జంతువుల్లా ఊరికే టైం గడపడంలో ఉంటే నిరీహకి భయపడైనా మనిషెప్పుడూ ఏదో ఒక వ్యాపకం లో ఇరుక్కోక తప్పదా? స్వేచ్చ, సంతోషం, సౌకర్యం ఇవి సాపేక్షాలుగా తప్ప ఆబ్జెక్టివ్ గా అనుభవంలోకి రావా? మనకి ఉన్నవాటి విలువ తెలియాలంటే ఆ సాపేక్షత్వాన్ని మనమే ప్రయత్నపూర్వకంగా సృష్టించుకోవాలా ఎప్పటికప్పుడు?
14/7/2020
Image may contain: 2 people, text that says "SHAWSHANK EDEMPTI QUOTES SCOOPWHOOP.com 3026 These walls are funny. First you hate 'em, then you get used to 'em. After long enough, you get so you depend on 'em. That's 'institutionalized."
<img class="j1lvzwm4" src="data:;base64, ” width=”18″ height=”18″ />
<img class="j1lvzwm4" src="data:;base64, ” width=”18″ height=”18″ />
<img class="j1lvzwm4" src="data:;base64, ” width=”18″ height=”18″ />
Rekha Jyothi, UshaJyothi Bandham and 35 others
2 comments
3 shares
Like

Comment
Share

Comments

నా చెల్లెలు యామిని

డబ్బులిచ్చి బజారుకి పంపితే సరిగ్గా చిల్లర తేగలదో లేదో తెలీదు. “అసలు రేటు వెయ్యి, మనక్కాబట్టి రెండొందలకిచ్చారు” అని ఏమేం వస్తువులు తెలివితక్కువగా కొంటందో అని ఇంట్లో అందరం ఒకం కన్నేసి ఉంటాం. ఎవరన్నా తన గురించి ఒక మంచిమాట చెప్పగానే “వాళ్లకి నేనంటే ఎంతిష్టమో, చాలా మంచోళ్ళు” అని ఒకటే ఊదరకొట్టుడు. వెర్రిమాలోకం అనే మాటకి పర్ఫెక్ట్ డెఫినెషన్ లాంటి పిల్ల.
 
టెడ్డీ బేర్ కొనుక్కోడం దానికి చిన్నప్పటి కల. రోజూ ఇంట్లో ఇచ్చే రూపాయి, అర్ధరూపాయి దాచుకునేది. నాకు ఉన్నట్టుండి ఇంటర్వ్యూకి రమ్మని హైద్రాబాద్ నుంచి కాల్. నాన్న వూర్లో లేడు. బస్ టికెట్ కోసం ఆ దాచుకున్న డబ్బులిచ్చింది. నాక్కాస్త జీతం పెరిగాక దానికొక పింక్ టెడ్దీ కొనిచ్చాను. అది ఇంకా తన దగ్గరుంది.
 
దానికి పిల్లలంటే ఇష్టం. నా పిల్లలతో నాకంటే అదే ఎక్కువ ప్రేమగా ఉంటది. ఆ అతిప్రేమ చాదస్తంతో వాళ్లని ఫుల్ గా ఇరిటేట్ చేసేది కూడా. సత్యజిత్ రే, ఆర్.కే. నారాయణన్, రస్కిన్ బాండ్ కథలన్నీ తను చదివి వినిపిస్తుంటే పిల్లలు బోర్లా పడుకుని పరమ ఉత్కంఠతో వినేవాళ్ళు. ఇప్పుడు పిన్ని ఇంగ్లిష్ ని కరెక్ట్ చేస్తారు వాళ్ళు.
 
దెబ్బ తగిలిన పిల్లిని ఇంట్లోకి తెచ్చి పసుపు రాసి మా అమ్మ తిట్లని గాలికొదిలేసి హాస్పిటళ్ల చుట్టూ తిప్పి ఆ పిల్లి చచ్చిపోతే దిగులు పడింది. ఇంగ్లీష్ ట్యూషన్లు చెప్పి రెండు వేలొస్తే ఇంటికొచ్చే దార్లో చారిటీ కి ఇచ్చి వచ్చింది. హ్యూమన్ ట్రాఫికింగ్ వల్ల బలైన ఆడపిల్లల్ని ఇంటర్వ్యూలు చేసి ఆర్టికల్స్ రాసే రోజుల్లో రాత్రుళ్ళు గుక్కపట్టి ఏడ్చేది. ఆ పనిమీద ఒక్కతే కలకత్తా వెళ్ళి వాళ్లతో కొన్నిరోజులున్నప్పుడు “ఈ బిత్తిరి మొహందేనా అంత దూరం వెళ్ళిందని నేనూ, అమ్మా నిముష నిముషం ఫోన్ చేసి జాగ్రత్తలు చెప్పేవాళ్లం.” ఇప్పుడు కన్నవాళ్ళు దూరమైన పిల్లలతో హోం లో ఉంటూ వాళ్ల కబుర్లన్ని ఎడతెగకుండా చెప్తుంది.
ఎప్పుడేం నెత్తిమీదకి తెచ్చుకుంటుందో తెలీదు. ఎప్పుడే చిక్కుముడి వేసి మమ్మల్ని భయపెడుతుందో ఊహించలేము. ఇట్లాంటివాళ్ళు ఇంట్లో ఒక్కళ్ళుంటే చాలు. ఫుల్ టైం పాస్.
 
ఏ నిర్ణయం తీసుకోవాల్సొచ్చినా “అక్కనడిగి చెప్తాను” అని నా పీకలమీద పెట్టడం, నువ్వే నా రోల్ మోడల్ అని నన్ను బుర్ర గోక్కునేలా చెయ్యడం, చివరికి నేను చెప్పిన ఏ ఒక్క సలహా ఫాలో అవ్వకుండా తను చేసేది చెయ్యడం. టిపికల్ చెల్లి మెటీరియల్. నేను యామిని గురించి ఎక్కువగా మనసులోనూ తక్కువగా బయటికి అనే మాట “ఒసేయ్, నీకు మైండ్ ఉందా దొబ్బిందా?”
 
Anyway “Happy Birthday to my Best friend” <౩
 
19/7/2020

Are you feeling low?

పూర్తి ఆరోగ్యవంతులు ఎవరూ లేనట్టే పూర్తి సంతోషంతో బతికే మనుషులు కూడా ఎవరూ ఉండరు. కొందరు కాస్త ఎక్కువ సంతోషంగానో, ఎక్కువసేపు సంతోషంగానో ఉంటారు, లేదా ఉన్నట్టు కనపడతారు. లేదా అలా ఉండటానికి వదలకుండా జీవితాంతం ప్రయత్నం చేస్తూనే ఉంటారు.
 
“Tuesdays with Morrie” లో డెబ్భై ఏడేళ్ల ప్రొఫెసర్ త్వరలో చనిపోతానని తెలిసి వీల్ చెయిర్లో కాలం గడిపే పరిస్థితిలో ఉంటాడు. అతని స్టూడెంట్ మిచ్ అడుగుతాడు “మీరు ఇలాంటి స్థితిలో కూడా ఎప్పుడూ సంతోషంగా ఎట్లా ఉంటున్నారు?” అని. దానికి ఆయన ఇలా అంటాడు “ఎప్పుడూ బాగున్నానని ఎవరన్నారు? తెల్లారుఝామున మెలకువొస్తుంది. మా ఆవిడ, హెల్పర్ అందరూ నిద్రలో ఉంటారు. మంచంలోనుంచి కదల్లేను. వాళ్ళు లేచేవరకూ చప్పుడు రాకుండా ఏడుస్తూ ఉంటాను. పగలు థెరఫీ, నన్ను చూడటానికొచ్చే విజటర్స్ వల్ల హుషారొస్తుంది. మళ్ళీ రాత్రికి మామూలే.” అని.
 
బాగుండటం, బాగైపోవడం అంటే అస్తమానం పిచ్చెక్కినట్టు నవ్వుతూ, ఇరవైనాలుగ్గంటలూ గంతులేస్తూ తిరగడం అనేది భ్రమ. రోజూ ఏడుగంటలు గాఢంగా నిద్రపోవడం కూడా ఇప్పుటి రోజుల్లో పెద్ద లగ్జరీ అనే అనుకోవాలి. రోజులో ఎంతోకొంత సమయం ప్రతి మనిషిని ఏదో ఒక దిగులు కబళిస్తుంది. ఒక్కో దశలో రోజంతా అదే ఉన్నట్టు ఉంటుంది. ఇదంతా మాజికల్ గా ఒక పూటలో మారిపోదు. పోయినవారం రోజుకి మూడు గంటలు ఏడిస్తే ఈవారం దాన్ని రెండు గంటలకి తీసుకురాగలమా అని ఆలోచించాలి. ఒక గంటసేపు సినిమా చూడ్దమో, ఎవర్తోనైనా మాట్లడ్దమో వీలతుందా అని ప్రయత్నించాలి. అది కూడా కేవలం ప్రయత్నమే తప్ప వెంటనే రిజల్ట్ కనపడదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి.
 
I know, అసలు అంత ఎఫర్ట్ పెట్టగలిగితే, అంత లాజికల్ గా ఎవరికి వాళ్ళు హెల్ప్ చేసుకోగలిగితే అది మెంటల్ హెల్త్ ప్రాబ్లెం కాదు. శరీరానికి ఏదైనా జబ్బు చేసినప్పుడు దానికి అవసరమైన ఆహారం సహించదు, మందు వేసుకోబుద్ధి కాదు, తగిన రెస్ట్ తీసుకోడానికి నొప్పి అడ్డుపడుతుంది. అట్లాగే డిప్రెస్డ్ గా ఉన్నప్పుడు దాన్నించి బయట పడటానికి ఏం అవసరమో అవి చేసే శక్తి రాదు. జ్వరమొచ్చి తిండి సహించనప్పుడు “ఎట్లాగో ఈ కాస్తా తిని మందేసుకో” అని పక్కవాళ్ళు బతిమాలినట్టు “మా అమ్మవి కదూ, కాసేపు ఈ సినిమా చూద్దాం రా” అని డెప్రెషన్ లో ఉన్నవాళ్లకి ఆసరా ఇచ్చేంత అవగాహన ఇంకా మనకి లేదు. ఒకవేళ అలా మంచి మాటల్తో సపోర్ట్ చేసేవాళ్ళున్నా వాళ్లతో రూడ్ గా మాట్లాడటం, గ్రాంటెడ్ గా తీసుకోడం, కృతజ్ఞత లేకపోవడం, తిరిగి వాళ్లనే నిందించడం లాంటివి ఈ రోగ లక్షణాలు. అసలే బాగోకపోవడంతో పాటు, బాగుపరిచే మనుషుల్ని, సలహాల్ని, అవకాశాల్ని పక్కకి తొయ్యడం ఇంకా పెద్ద లాస్. అట్లా అనుకుని “నేనింతే, నా ఏడుపు, నా జీవితం ఇంతే.” అని వల్లించుకుంటే లాభం లేదు. రోజూ కడుపునొప్పొస్తుందని కొన్ని నెలలపాటు మనం ఎవరికైనా చెప్పి బాధ పడుతూ ఉన్నామనుకోండి. మన సంభాషణలో అస్తమానం ఆ కడుపునొప్పి గురించే చెప్తున్నాం అనుకోండి. వాళ్ళు వాము తినమనో, ఫలానా మందేసుకోమనో, ఫలానా తిండి తినద్దనో, డాక్టర్ ని కలవమనో చెప్తే వాటిల్లో కనీసం ఒక చిన్న ప్రయత్నం చెయ్యకుండా ఆ సలహాలన్నీ పెడచెవిన పెట్టి “నాకు కడుపునొప్పి జన్మకి తగ్గదు” అని రోజూ ఏడిస్తే అది ఎవరికీ మంచిది కాదు. బాగవ్వాలనుకునేవాళ్లు ఆ మాత్రం ప్రయత్నం చెయ్యక తప్పదు.
 
ఫామిలీ మాన్ సిరీస్ లో ప్రియమణి మెంటల్ హెల్త్ గురించి ఒక ప్రెజెంటేషన్ ఇస్తుంది. “మానసిక అనారోగ్యం కూడా కడుపునొప్పి లాంటిదే” అని. అది చెప్పేటప్పుడు ఆమె హావభావాలు బాడీ లాంగ్వేజ్ కాస్త అతిగా అనిపించింది నాకు. ఈమె ఏంటి ఇంత మాములు విషయాన్ని రాకెట్ సైన్స్ చెప్తున్నంత బిల్డప్ తో చెబుతుంది అని. కానీ, ఇప్పుడనిపిస్తుంది, మన మెదళ్లలోకి ఈ విషయం సింక్ అవ్వడం రాకెట్ సైన్స్ కంటే గొప్ప విషయం అని. తరతరాలుగా మనం దీన్నంతా రొమాంటిసైజ్ చెయ్యడానికి, గ్లామరస్ గా చూపించుకోడానికి, లోతైన మనుషులుగా కనపడ్దంకోసం మెలాంకలీ ని వాడుకోవడానికి అలవాటు పడిపోయాం. ఆ లగ్జరీని అంత తేలిగ్గా వదులుకోలేము. ఒంటరితనం గురించి కవిత రాస్తే ఉన్నంత గొప్పగా అజీర్తి గురించి రాస్తే ఉండదు కదా.
 
“నీకేం మంచి ఉద్యోగముంది, మంచి ఫ్రెండ్సున్నారు, నీ పార్ట్నర్ మంచి మనిషి, నీకు నా బాధ అర్థం కాదు” అని సాయం చెయ్యబోయినవాళ్లమీద నిష్టూరపడతాం మనసు బాగోనప్పుడు. మరీ సిల్వర్ స్పూన్ తోనో, గిఫ్టెడ్ టాలెంట్స్ తోనో పుడితే తప్ప మాములు మనుషులెవ్వరికి ఏదీ ఫ్రీ గా రాదు. ఒకవేళ లక్కీగా దొరికినా వాటిని నిలబెట్టుకోవడం అనుదిన ప్రయత్నం. ఇన్ని సంవత్సరాలు దగ్గర మనుషుల్ని నిలబెట్టుకోవడం అంటే వాళ్లని ఎన్నిటికో క్షమించి, వాళ్లకోసం ఎన్నో త్యాగం చేసి, సాయాలు చేసి. వాళ్ల తత్వాన్ని అర్థం చేసుకుని దాన్ని కించపరచకుండా గౌరవంగా మాట్లాడితేనే నిలుస్తాయి బంధాలు. అంత జాగ్రత్తగా ఉన్నా నిలవకపోవడం ఒక్కోసారి దురదృష్టమే కానీ, అసలు ఎంపతీ లేకుండా, ప్రయత్నం చెయ్యకుండా, దగ్గర వాళ్లని అనకూడనివి అని విసిగించి పోగొట్టుకుని “నాకు ఫ్రెండ్స్ లేరు, నీకున్నారు” అని ఒక నిందలాగా అని మనకి సాయం చేసేవాళ్ల మనసు గాయపరచడం తప్ప ఏం సాధించలేం. డబ్బైనా, ఉద్యోగమైనా, ఒక ఫీల్డ్ లో పేరు తెచ్చుకోవడమైనా జీవితమంతా ఎంతో శ్రమ పడితే కానీ దక్కదు. రాత్రంతా ఏదో సమస్యతో నిద్రలేకపోయినా పొద్దున టైం కి లేచి పనిచేసుకోవడం, వొళ్ళు, మనసు ఎంత బాగోపోయినా ఏ డెడ్లైన్ ని మిస్ అవకుండా ఏ బాధ్యతని తప్పించుకోకుండా పనిచెయ్యడం అంత తేలిక కాదు. ఇతరులకి ఆయాచితంగా అన్నీ వచ్చి పడ్డట్టు, అందుకే వాళ్ళు బాగున్నట్టు, మనం బాగోనట్టు నమ్మితే మనకే ప్రమాదం.
 
థెరపిస్ట్ లు, సైకాలజిస్ట్ లు వాళ్ల కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం ప్రతి పదిహేను రోజులకో, నెలకో మరో ప్రొఫెషనల్ దగ్గరకు కౌన్సలింగ్ కి వెళ్లాలి. ఇతరుల బాధలన్నీ వింటూ ఉండటం వల్ల వాళ్ల మానసిక ఆరోగ్యం మీద ప్రభావం ఉండే అవకాశం ఎక్కువ కాబట్టి ఈ తప్పనిసరి రూల్ ఉంది. (Correct me if this information is wrong). సైకాలజీ చదువుకుని, ట్రయినింగ్ తీసుకుని, ఎన్నో కేస్ లని రోజూ చూసే ప్రొఫెషనల్స్ సంగతే ఇలా ఉంటే. అసలు ఈ ఫీల్డ్ కి ఏ సంబంధం లేకుండా ఎవరి జీవితాల్లో వాళ్ళు స్ట్రగుల్ అయ్యే మాములు మనుషుల సంగతేంటి? ఏ క్వాలిఫికేషన్ లేకున్నా ఇంట్లో ఒక మనిషికో, ఫ్రెండ్ కో కేవలం ప్రేమ, సహనం తో వాళ్ల ట్రామా ని వింటూ, ఓదారుస్తూ, సలహాలిస్తూ, వీళ్ల మనసుల్లో వేరే బాధలు, భయాలు ట్రిగ్గర్ ఔతూ, వీళ్ల మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బ తిని ఉన్నా, తింటున్నా కూడగట్టుకుని అవతలిమనిషిని దగ్గరకు తీసుకోవడం అనేది చాలా పెద్ద బాధ్యత. “Everything will be fine, you are awesome, Stay strong, you need not share anything, I respect your privacy.” అని చప్పటి మాటలతో దులుపుకునే సహాయం గురించి కాదు ఇక్కడ చెప్తున్నది. (Again Morrie says “You are not respecting her privacy. In Fact, you are denying her feelings”) నిజంగా ఎంపథైజ్ అయ్యి, ఆ బాధ తమదే అన్నట్టు నమ్మి, తమ అనుభవంలోంచి చూసి వివరాలు డిస్కస్ చేసి, పాయింట్ టూ పాయట్ స్పెసిఫిగ్గా గా వివరించి చెప్పి, ఈ మనిషి కాస్తైనా బాగుపడాలి అని పక్కనుండేవాళ్లు అరుదు. అంత శ్రమ తీసుకోవాల్సిన అవసరం, ఈ ప్రాసెస్ లో తమమీద ఎఫెక్ట్ తీసుకోవాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఐనా అదంతా ఎవరైనా మనకోసం చేస్తుంటే ఆ ప్రేమని, శ్రమని, వాళ్లు తీసుకున్న రిస్క్ ని గౌరవిస్తే బాగుంటుంది. వాళ్ళ శక్తికి మించినప్పుడు కొంత ఊపిరి పీల్చుకోడానికి పక్కకెళ్తే నిందించకుండా ఉంటే బాగుంటుంది.
 
పిల్లలకి బయాలజీ పాఠాలతో పాటో, ఫస్ట్ ఎయిడ్ గురించి చెప్పినట్టో టెక్స్ట్ బుక్స్ లో మెంటల్ హెల్త్ గురించిన కనీస అవగాహన కల్పించాలి. అట్లాగే ఇంట్లో చిన్న చిన్న పనులు నేర్పినట్టు, సేఫ్టీ గురించి జాగ్రత్తలు చెప్పినట్టు వయసుకి తగ్గట్టు ఈ విషయాలు కూడా అర్థమయ్యేలా చేస్తే మంచిది. పెద్దవాళ్లం, మన దగ్గరి మనుషులు ఇలాంటి సమస్యలతో ఉన్నప్పుడు మనం ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనేవి తెలుసుకోవాలి. మనమే పేషెంట్స్ అనిపిస్తే సమస్యని ఒప్పుకుని పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ హెల్ప్ మొహమాటం లేకుండా అడిగి ఆ హెల్ప్ కి విలువిచ్చి, సహాయానికి, ట్రీట్మెంట్ కి సహకరించి త్వరగా బాగవ్వడానికి ప్రయత్నించాలి.
 
Let us not romanticise it. Becauase, illness is not a good thing. We all need to work together to deal with it.